Dil Raju Sukumar - ఆశిష్ కోసం 'ఆర్య' కాంబో

Friday,January 21,2022 - 03:07 by Z_CLU

Dil Raju Sukumar team up again after Arya for Ashish

దిల్ రాజు -సుకుమార్ కాంబోలో సినిమా వచ్చి చాన్నాళ్ళవుతోంది. ‘ఆర్య’ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదు. అయితే ఇన్నాళ్ళకి మళ్ళీ వీరిద్దరి కలిసి సినిమా చేయబోతున్నారు. అవును దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెండో సినిమాకోసం వీళ్ళు కలిసి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు ఆశిష్. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడిగా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ మొదటి రిలీజ్ అవ్వకుండానే రెండో సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. కానీ డీటెయిల్స్ మాత్రం తాజాగా బయటికొచ్చాయి.

ఆశిష్ రెండో సినిమాను దిల్ రాజుతో కలిసి సుకుమార్ రైటింగ్స్ బేనర్ పై నిర్మిస్తున్నాడు సుకుమార్. అంతే కాదు ఈ సినిమాకు తనే స్వయంగా మాటలు అందిస్తుండటం విశేషం. సుకుమార్ దగ్గర చాలా కాలంగా పని చేస్తున్న కాశి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. ప్రస్తుతానికి స్క్రిప్ట్ లాక్ అయింది. తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు టీం.

ashish

తనకి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దిల్ రాజు కోసం అలాగే శిష్యుడు కాశి కోసం ఇటు నిర్మాతగా అటు మాటల రచయితగా ఆశిష్ సినిమాకు పనిచేయబోతున్నాడు సుక్కు. ఈ సినిమాకు సెల్ఫిష్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా దిల్ రాజు ఈ విషయాన్ని ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు మిగతా టెక్నీషియన్స్ ని కూడా ఫైనల్ చేసుకున్నారు. హీరోయిన్ ని ఫిక్స్ చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి.