అసలైన సందడి ఈ నెలలోనే...

Saturday,May 05,2018 - 10:03 by Z_CLU

 అల్లు  అర్జున్  ‘నా  పేరు సూర్య’  గ్రాండ్ గా రిలీజయింది. దీంతో సమ్మర్ రిలీజ్ కి ఫిక్స్ అయిన సినిమాల సందడి బిగిన్ అయింది. డిఫెరెంట్ జోనర్స్ లో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు వాటి అగ్రెసివ్ ప్రమోషన్స్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

ఈ నెల 9న గ్రాండ్ గా రిలీజవుతుంది మహానటి. హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజవుతున్న ఈ సావిత్రి బయోపిక్ చుట్టూ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా మే 11 న పూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘మెహబూబా’ బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది.

ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ మే 18 న రిలీజవుతుంది. ఫ్యాంటసీ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమాపై కూడా టాలీవుడ్ లో భారీ అంచనాలే క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమా తరవాత అదే వరసలో మే 24 న రవితేజ ‘నేలటికెట్’ రిలీజ్ అవుతుండగా జస్ట్ 1 రోజు గ్యాప్ లో కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ , నాగార్జున ‘ఆఫీసర్’ రిలీజవుతున్నాయి.