సింగపూర్ చెక్కేసిన బబ్లీ బ్యూటీ

Thursday,May 31,2018 - 04:49 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్లలో ఒకరు రాశిఖన్నా. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్ లో కూడా ఈమె సినిమాలు చేస్తోంది. పూర్తిగా రెస్ట్ కు దూరమైంది. మొత్తానికి రాశి కోరుకునే రెస్ట్ టైం రానే వచ్చింది. సినిమాల షెడ్యూల్స్ అన్నీ ఓ కొలిక్కి తీసుకొచ్చిన ఈ బ్యూటీ సింగపూర్ లో ల్యాండ్ అయింది.

సింగపూర్ లో ఓ 10 రోజుల పాటు సేదతీరి తర్వాత తిరిగి సినిమాలు షురూ చేయబోతోంది రాశిఖన్నా. ప్రస్తుతం ఆమె చేతిలో శ్రీనివాసకల్యాణం సినిమాతో పాటు 2 తమిళ సినిమాలున్నాయి. సింగపూర్ నుంచి తిరిగొచ్చిన వెంటనే శ్రీనివాస కల్యాణం ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

శ్రీనివాసకల్యాణం ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా 2 తమిళ సినిమాల్ని పూర్తిచేయనుంది రాశి. ఈ గ్యాప్ లో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఆ సినిమా ఏంటనేది సింగపూర్ ట్రిప్ తర్వాత తెలుస్తుంది.