ఎక్కువ సినిమాలు చేయడానికి రీజన్ అదే – నాని

Monday,April 09,2018 - 03:18 by Z_CLU

నాని ‘కృష్ణార్జున యుద్ధం’ ఈ నెల 12 న రిలీజవుతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై క్యూరాసిటీని జెనెరేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది. అయితే 2 కంప్లీట్ డిఫెరెంట్ గెటప్ లలో కనిపించనున్న నాని, అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా తనకెంతో స్పెషల్ అని చెప్పుకున్నాడు. మరీ ముఖ్యంగా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి రీజన్ కూడా బయటపెట్టాడు.

“ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒకేలాంటి టెన్షన్ ఉంటుంది. నేను ఎక్కువ సినిమాలు చేయడానికి కూడా రీజన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంటే ఆ టెన్షన్ అలవాటైపోతుంది అనుకుంటాను కానీ ఇప్పటికీ నా ఫస్ట్ సినిమా రిలీజ్ టైమ్ లో ఎంతలా టెన్షన్ పడ్డానో, ఇప్పుడూ అలాగే ఉంది. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాని టెస్టింగ్ థియేటర్ లో ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. సినిమా నాకంతలా నచ్చేసింది” అని చెప్పుకున్నాడు .

మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్ తో పాటు రుక్సర్ మీర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకి హిప్ హాప్ తమిళ మ్యూజిక్ కంపోజర్.