సాయి ధరం తేజ్ కొత్త సినిమాకు హీరోయిన్ ఫిక్స్ ?

Monday,April 09,2018 - 11:01 by Z_CLU

ప్రెజెంట్ కరుణాకరన్ డైరెక్షన్ లో  లవ్ & ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేస్తున్న సాయి ధరం తేజ్  కిషోర్ తిరుమల తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం  ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా లో సాయి ధరం తేజ్ సరసన మేఘా ఆకాశ్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసారనే టాక్ వినిపిస్తుంది.

నితిన్ ‘లై’ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన మేఘ ఆకాశ్ లేటెస్ట్ గా నితిన్ తో మరోసారి ‘ఛల్ మోహన్ రంగ’లో నటించింది. కిషోర్ తిరుమల స్టైల్ లో క్యూట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాకు ఈ బబ్లీ బ్యూటీ  పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట మేకర్స్.

త్వరలోనే గ్రాండ్ గా లాంచ్ కానున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ , రవి, మోహన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.