నాగార్జున రాబోయే సినిమాల వివరాలివే...

Thursday,August 02,2018 - 01:31 by Z_CLU

ప్రస్తుతం ‘దేవదాస్’ తో సినిమాతో బిజీగా  ఉన్నాడు నాగార్జున. అయితే మరో పదిరోజుల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నాని, నాగ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్టయితే ఈ సినిమాకి  సీక్వెల్ కూడా తీస్తాం అన్నాడు నాగ్.

అయితే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘దేవదాస్’ తో పాటు తన నెక్స్ట్ సినిమాల ప్రిపరేషన్స్ లో ఉన్నాడు నాగ్. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, రైటర్ సత్యానంద్ తో కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు రివీల్ చేయనున్నారు ఫిలిమ్ మేకర్స్.

ఇకపోతే నాగార్జున నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ కూడా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో నాగ్ 15 నిమిషాల పాటు కనిపించనున్నాడు. దీంతో పాటు ఇదే ఏడాది సెట్స్ పైకి రానున్న మరో తమిళ సినిమాకు కూడా సంతకం చేశాడు నాగ్. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని డీటేల్స్ త్వరలో రివీల్ చేస్తారు ఫిలిమ్ మేకర్స్.