నాగార్జున కెరీర్ లోనే ఇది ఫస్ట్ టైమ్

Wednesday,March 20,2019 - 11:03 by Z_CLU

కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు నాగార్జున. ఫస్ట్ సినిమా నుండి ఇప్పటి వరకు లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్లు. కానీ ఎక్కడా సీక్వెల్ గురించి ప్రస్తావించలేదు. ఏ సినిమా చేసిన తన సినిమా తాలూకు సక్సెస్ క్రేజ్ ని కాపాడుకోవాలనే ఆలోచన తప్ప, ఇంతలా పర్టికులర్ సినిమాలపై ప్రేమను పెంచుకోలేదు నాగ్. కరియర్ లో ఇదే ఫస్ట్ టైమ్.

మన్మధుడు 2, బంగార్రాజు సినిమాల సీక్వెల్స్ లో నటిస్తున్నాడు నాగ్. అన్ని సినిమాల్లాగే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా కంప్లీట్ గా లాక్ అయ్యాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందునా ఈ సినిమాలపై ఎంత అభిమానమంటే స్వయంగా తన బ్యానర్ లోనే నిర్మిస్తున్నాడు. ప్రతీది తన పర్యవేక్షణలో జరిగేలా చూస్తున్నాడు.

రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ‘మన్మధుడు 2’ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనే ఒక్క విషయం తప్ప, ఇంకా ఈ సినిమా గురించి ఏ విషయం రివీల్ కాలేదు. కానీ నాగ్ కాన్ఫిడెంట్ గా ఈ టైటిల్ సజెస్ట్ చేశాడంటే, సినిమాలో మ్యాటర్ కూడా అదే స్థాయిలో ఉంటుందంటున్నారు ఫ్యాన్స్.

రవితేజ తో ‘నేల టికెట్’ తరవాత కళ్యాణ్ కృష్ణ కూడా  ఫోకస్ మొత్తం బంగార్రాజు పైనే పెట్టాడు. ఏది ఏమైనా నాగార్జున ఫిక్సయితే చేసేస్తాడు అనేది ఎంత వాస్తవమో, వర్కవుట్ అవుతుందనుకుంటేనే ఫిక్సవుతాడు అన్నది కూడా అంతే నిజం.