సరికొత్తగా కనిపించనున్న నాగార్జున

Tuesday,September 25,2018 - 10:10 by Z_CLU

యంగ్ హీరోలకు ధీటుగా సరికొత్త స్టోరీస్ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు నాగార్జున. స్టోరీలో కొత్తదనం ఉండాలే కానీ లాంగ్వేజ్ ఏంటనేది కూడా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. అంత స్ట్రాంగ్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ కాబట్టే ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమాకి సంతకం చేశాడు నాగ్.

600 ఏళ్ల క్రితం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో వెరీ స్పెషల్ రోల్ లో కనిపించనున్నట్టు చెప్పుకున్నాడు నాగ్. ఈ సినిమాలో నాగ్ లుక్స్ దగ్గరి నుండి క్యారెక్టర్ వరకు ప్రతీది సరికొత్తగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దేవదాస్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నాగ్, త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రాబోతున్నాడు.

భారీ గ్రాఫిక్ వర్క్ తో తెరకెక్కనున్న ఈ సినిమా మ్యాగ్జిమం షూట్ హైదరాబాద్ లో జరగనుంది. శ్రీ తెనాండల్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి షాన్ రోల్డాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఆదితిరావు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో S.J. సూర్య, శరత్ కుమార్ లు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.