నాగార్జున ఇంటర్వ్యూ

Monday,September 24,2018 - 02:36 by Z_CLU

నాని- నాగార్జున నటించిన దేవదాస్ ఈ నెల 27 న రిలీజవుతుంది. ఇది ‘లాఫింగ్ దేవదాస్’ అంటున్న నాగార్జున, సినిమా మొత్తంలో ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.  ఈ సందర్భంగా నాగ్ మీడియాతో చేసిన చిట్ చాట్.

చాలా రోజుల తరవాత..

మళ్ళీ డాన్ లా నటించా ఈ సినిమాలో. కానీ ఈ సినిమాలో సెటిల్ మెంట్స్ లాంటివి ఏమీ ఉండవు. దేవదాస్ సినిమా ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్ షిప్ స్టోరీ…

నేను – నా హీరోయిన్…

సినిమాలో మాది మంచి లవ్ స్టోరీ. హీరోయిన్ న్యూస్ రీడర్. ఆ అమ్మాయి  కాలేజ్ డేస్ నుండి తనను లవ్ చేస్తుంటాడు కానీ చెప్పడు. అందరినీ బెదిరిస్తుంటాడు కానీ, ఆ అమ్మాయి వరకు వచ్చేసరికి సైలెంట్ అయిపోతుంటాడు. అప్పుడు నాని ఇన్వాల్వ్ అయి ఇద్దరినీ కలుపుతాడు.

సొంత బ్యానర్ లో సినిమా…

ధనుష్ తో తెలుగు, తమిళ్ బైలింగ్వల్ లో చేస్తున్నాను. హిందీ బ్రహ్మాస్త్ర కూడా, మల్టీస్టారరే. మల్టీస్టారర్స్ తో పాటు సోలో సినిమాలు కూడా చేస్తాను. ప్రస్తుతం అన్నపూర్ణ బ్యానర్ లోనే ఇంకో సినిమా ప్లానింగ్ జరుగుతుంది. అది మల్టీస్టారర్ కాదు.

ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతాయి…

మల్టీస్టారర్ అనగానే ఆబివియస్ గా ప్రెజర్ పెరిగిపోతుంది. తేడా జరిగితే ఇద్దరు కలిసి హిట్ కొట్టలేకపోయారు అనేస్తారు. అందుకే  మల్టీస్టారర్  స్టోరీస్ ఇంకా  జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది.

అలా జరిగింది…

దేవదాస్  ఒరిజినల్ స్టోరీ ముంబై రైటర్ చెప్పడం జరిగింది. ఆ తరవాత ఆ కథపై చాలా మంచి డైరెక్టర్స్ పని చేయడం జరిగింది. చివరికి శ్రీరామ్ ఆదిత్యను నాని రిఫర్ చేసినట్టున్నాడు. శ్రీరామ్ చాలా మంది రైటర్స్ హెల్ప్ తీసుకుని స్టోరీని డెవెలప్ చేసుకున్నాడు.

అస్సలు బయటపడడు.

దేవ క్యారెక్టర్ చాలా బావుంటుంది.  ఎప్పుడు చూసినా చాలా ఎనర్జిటిక్ గా నవ్వుతూ ఉంటాడు. కానీ తన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఆ బాధ కానీ  బయట పడకుండా బ్రతికేస్తుంటాడు. క్లైమాక్స్  వరకు వచ్చేసరికి అంతా క్లియర్ అయిపోతుంది… అద్భుతమైన క్యారెక్టర్..

 

‘ఆఖరిపోరాటం’ చేయనన్నా…

వైజయంతీ బ్యానర్ లో చేసిన ఫస్ట్ సినిమా ‘ఆఖరిపోరాటం’. ఆ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ అనగానే, ఇంక సినిమాలో నాకేముంటుందని నో చెప్పా. అప్పుడు నాన్నగారు కన్విన్స్ చేసి ఆ సినిమా చేసేలా చేశారు. సినిమాలో హీరోయిన్ కి ఎంత స్కోప్ ఉన్నా, హీరోని ఎక్కడ ఉంచాలో రాఘవేంద్ర రావు గారికి, దత్ గారికి బాగా తెలుసు…

నా సొంత సినిమా…

అశ్వినీదత్ గారు నాకు చాలా క్లోజ్.  దేవదాస్ నాకు సొంత సినిమా లాంటిదే.

కమ్ బ్యాక్ మూవీ…

అశ్వినీదత్ గారు  ఈ సినిమా  తనకు ‘కమ్ బ్యాక్ మూవీ’ అన్నారు. అప్పుడు కమ్ బ్యాక్ మూవీ ఏంటండీ, కమ్ ఫార్వార్డ్ అన్నాను..

శ్రీరామ్ ఆదిత్య…

చాలా బాగా హ్యాండిల్ చేశాడు శ్రీరామ్. ప్రతీది ప్లాన్డ్ గా చేసుకొచ్చాడు. సెట్స్ పైకి రాకముందు ఏదైతే అనుకున్నామో అదే స్క్రీన్ పై జెనెరేట్ చేశాడు.

నాని అంటే..

నాని సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత న్యాచురల్ గా ఉంటాయో అంత మ్యాజిక్ ఉంటుంది ఆ  సినిమాల్లో.

నో కంపారిజన్స్…

నాన్నగారి దేవదాసుకి ఈ దేవదాసుకి అస్సలు సంబంధం లేదు. ఒక్క బాటిల్ తప్ప ఏదీ ఈ సినిమాలో ఉండదు. ఇది కంప్లీట్ గా లాఫింగ్ దేవదాస్.