దేవదాస్ రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,July 12,2018 - 10:02 by Z_CLU

నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతోంది దేవదాస్ సినిమా. రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన యూనిట్, ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, దేవదాస్ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. దాదాపు ఇదే డేట్ లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

సినిమాలో దేవ అనే డాన్ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడు. ఇక దాస్ అనే డాక్టర్ క్యారెక్టర్ లో నేచురల్ స్టార్ మెరవనున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. సినిమా షూటింగ్ దాదాపు 60శాతం పూర్తయింది.

దేవదాస్ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు.