నాగచైతన్య సరసన మరోసారి రకుల్

Thursday,July 12,2018 - 11:01 by Z_CLU

వీళ్లిద్దరిదీ సూపర్ హిట్ జోడీ. చైతూ-రకుల్ కలిసి చేసిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా సూపర్ హిట్ అయింది. అప్పట్నుంచి వీళ్లిద్దరి కాంబోలో మరో మూవీ కోసం అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా వెయిటింగ్.

ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. తన కొత్త సినిమాతో రకుల్ ను మరోసారి రిపీట్ చేశాడు చైతూ వెంకీ-నాగచైతన్య హీరోలుగా నిన్ననే కొత్త సినిమా లాంఛ్ అయింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాబి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రానుంది ఈ మూవీ. ఇందులో నాగచైతన్య సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను సెలక్ట్ చేశారు. ఈ విషయాన్ని రకుల్ కూడా అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేసింది.

వెంకీ-చైతూ సినిమా వెరీవెరీ స్పెషల్ గా ఉండబోతోంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు కాస్త యాక్షన్ కూడా మిక్స్ అయి ఉంటుందట. ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక యాక్షన్ ఎలిమెంట్స్ ను బాబి అద్భుతంగా హ్యాండిల్ చేస్తాడనే విషయం జై లవకుశతో ప్రూవ్ అయింది. అందుకే ‘వెంకీ మామ’ ప్రాజెక్టు హాట్ కేక్ లా మారింది.