నాగార్జున, నాని హీరోలుగా మల్టీస్టారర్ మూవీ

Friday,October 20,2017 - 10:33 by Z_CLU

మన్మధుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా మల్టీస్టారర్ మూవీ ఫిక్స్ అయింది. ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మాత అశ్వనీదత్ ప్రకటించారు. నాగ్, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నామని ప్రకటించారు అశ్వనీదత్. జనవరి నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వస్తుందట.

మంచి కంటెంట్ ఉంటే తప్ప సినిమాలు నిర్మించరు అశ్వనీదత్. అందుకే ఈమధ్య కాలంలో సినిమా నిర్మాణానికి కూడా దూరమయ్యారు. ఇలాంటి ప్రొడ్యూసర్ ఓ సినిమా ఎనౌన్స్ చేశారంటే అందులో కచ్చితంగా మంచి కథ ఉంటుంది. ఆ కథకు నాగ్, నాని అంగీకారం కూడా తెలిపారు. ప్రస్తుతం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య.. స్క్రీన్ ప్లే పనుల్లో బిజీగా ఉన్నాడు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగార్జునకు ఇది ఐదో చిత్రం కావడం విశేషం. ఈ బ్యానర్ లో ఇన్ని సినిమాలు చేసిన హీరో మరెవరూ లేరు. ప్రస్తుతం నాగ్ ఖాళీగానే ఉన్నాడు. ఎలాంటి ప్రాజెక్టు ఎనౌన్స్ చేయలేదు. నాని మాత్రం ఒకేసారి 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకొస్తాయి.