మంచు మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' రిలీజ్ డేట్

Friday,October 20,2017 - 10:38 by Z_CLU

మంచు మనోజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఒక్కడు మిగిలాడు’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ప్రెజెంట్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు  సన్నాహాలు చేస్తున్నారు.. మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్రతో పాటు స్టూడెంట్ లీడర్ గా రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంటర్టైన్ చేయబోతున్న ఈ సినిమాకు అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వం వహిస్తుండగా ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోజ్ సరసన  అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తుండగా శివ నందిగామ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు.