వినాయక చవితి కానుకగా నాగ్-నాని సినిమా?

Sunday,May 20,2018 - 11:03 by Z_CLU

నాగార్జున, నాని కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ దాదాపు ఫిక్స్ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 12న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాడు నిర్మాత అశ్వనీదత్.

సెప్టెంబర్ 13న వినాయకచవితి పడింది. అందుకే ఆ పండగకు ఒక రోజు ముందు నాగ్-నాని మల్టీస్టారర్ ను విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. సెప్టెంబర్ 12 బుధవారం పడింది. మహానటి సినిమా కూడా ఇలా వీక్ మధ్యలో బుధవారమే రిలీజైంది. ఆ సెంటిమెంట్ కూడా దీనికి వర్కవుట్ అవుతుందేమో చూడాలి.

సినిమాలో నాగ్ సరసన “మళ్లీ రావా” ఫేం ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అటు నాని సరసన రష్మిక నటిస్తోంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.