సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్న హీరోయిన్స్

Sunday,May 20,2018 - 10:04 by Z_CLU

సినిమాలో స్క్రీన్ పై జస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ తోనే సరిపెట్టుకోలేదు హీరోయిన్స్. భాష నేర్చుకుని మరీ సొంత డబ్బింగ్ చెప్తున్నారు. ఆన్ స్క్రీన్ మెస్మరైజ్ చేయడమే కాదు ఎవరి సినిమాలకు వాళ్ళే చెప్పుకుని కంప్లీట్ పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు హీరోయిన్స్…

అదితి రావు హైదరి : మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెలియా’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన అదితి రావు హైదరి, ప్రస్తుతం ‘సమ్మోహనం’ సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. లాంగ్వేజ్ రాకపోయినా, కష్టపడి మరీ పర్ఫెక్షనిస్ట్ అనిపించుకునే ప్రాసెస్ లో ఉంది అదితి రావు హైదరి.

తమన్నా : వంశీ పైడిపల్లి సినిమాలో తన కరియర్ లోనే ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకుంది తమన్నా. ఈ నెల 25 న రిలీజ్ కి రెడీ అవుతున్న ‘నా నువ్వే’ సినిమాకి కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పి మెస్మరైజ్ చేయనుంది తమన్నా.

కీర్తి సురేష్ : ‘అజ్ఞాతవాసి’ లో సొంత డబ్బింగ్ చెప్పుకున్న కీర్తి సురేష్ ‘మహానటి’ సినిమాలోను సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

సమంతా : ‘మహానటి’ సినిమాకి తనే డబ్బింగ్ చెప్పుకుంది సమంతా. సీనియర్ నటి సావిత్రి బయోపిక్ తో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం బిగిన్ చేసిన సామ్, ఫ్యూచర్ సినిమాలలో కూడా తన వాయిస్ తో మెస్మరైజ్ చేసే ఆలోచనలో ఉంది.

రకుల్ ప్రీత్ సింగ్ : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్, గతంలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో జస్ట్  తన పర్ఫామెన్స్ తోనే కాదు వాయిస్ తో కూడా మెస్మరైజ్ చేసింది రకుల్.

సాయిపల్లవి : ‘ఫిదా’ తో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన ఈ ముద్దుగుమ్మ, ఫస్ట్ తెలుగు సినిమాతోనే సొంత డబ్బింగ్ బిగిన్ చేసింది. ‘ఫిదా’ తో పాటు MCA లోను తానే డబ్బింగ్ చెప్పుకుంది.

అనుపమ పరమేశ్వరన్ : అనుపమ స్క్రీన్ పై ఎంత ఎట్రాక్టివ్ గా ఉంటుందో వాయిస్ కూడా అంతే ఎట్రాక్టివ్ గా ఉంటుంది. అందుకే భాష రాకపోయినా పట్టు పట్టి మరీ అనుపమ చేత, డబ్బింగ్ చెప్పించుకుంటున్నారు ఫిల్మ్ మేకర్స్. వరసగా శతమానం భవతి, అ..ఆ…, ‘వున్నది ఒకటే జిందగీ’ సినిమాలకు డబ్బింగ్ చెప్పుకుంది అనుపమ.

శాలినీ పాండే : సెన్సేషనల్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన శాలినీ పాండే, ఫస్ట్ సినిమాతోనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఒక్క సినిమాతోనే లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ హీరోయిన్, ఫ్యూచర్ సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకోనుంది.

 

అనూ ఇమ్మాన్యువెల్ : కరియర్ బిగినింగ్ లో బిగ్గెస్ట్ స్టార్స్ సరసన నటించే అవకాశాలు దక్కించుకుంటున్న అనూ ఇమ్మాన్యువెల్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో డబ్బింగ్ చెప్పుకుంది.