నాగార్జున, నాగచైతన్య మల్టీస్టారర్ మూవీ

Saturday,May 26,2018 - 01:23 by Z_CLU

ఈ అక్కినేని తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి ఇప్పటికే తెరపై కనిపించారు. మనం సినిమాలో నాగ్, చైతూ కలిసి నటించారు. ప్రేమమ్ లో కూడా క్లైమాక్స్ లో నాగార్జున, నాగ చైతన్య ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగ్, చైతూ మల్టీస్టారర్ రాబోతోంది. ఈ మేరకు చర్చలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా ఓ క‌థ‌ను తయారు చేసుకున్న పూరి, నాగార్జున‌ను క‌లిసి క‌థ వినిపించాడ‌ట‌. ఆయ‌న‌కు ఆ స్టోరీలైన్ నచ్చినట్టు టాక్.

గతంలో నాగార్జున-పూరి కాంబోలో శివమణి లాంటి సూపర్ హిట్ వచ్చింది. కానీ చైతూ-పూరి కాంబో మాత్రం రాలేదు. ఈ స్టోరీ చైతూకు కూడా నచ్చితే.. పూరి జగన్నాధ్ కు మరో మంచి ప్రాజెక్టు దక్కినట్టవుతుంది. రీసెంట్ గా మెహబూబా సినిమా తీసిన పూరి, తన రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయాడు.