నాని బాటలో సుధీర్ బాబు
Saturday,May 26,2018 - 01:11 by Z_CLU
నాని నిర్మాతగా మారాడు. “అ!” అనే సినిమా కూడా తీశాడు. ఆ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి, స్వయంగా నాని వెల్లడించే వరకు ఆ విషయం ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు సుధీర్ బాబు కూడా అంతే సీక్రెట్ గా వ్యవహరించాడు.
ఈ హీరో కూడా నిర్మాతగా మారాడు. ఓ ప్రొడక్షన్ హౌజ్ కూడా పెట్టాడు. కేవలం నిర్మాణ సంస్థ పెట్టడే కాదు, ఆ బ్యానర్ పై ఓ సినిమా కూడా నిర్మిస్తున్నాడు. ఇదేదో నిన్న-మొన్న జరిగిన వ్యవహారం కాదు. సినిమా షూటింగ్ కూడా 80శాతానికి పైగా పూర్తయింది.
ఇప్పుడు తన బ్యానర్ పేరుతో పాటు సినిమా విశేషాల్ని వెల్లడిస్తానంటున్నాడు సుధీర్ బాబు. రామానాయుడు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో ట్రయినింగ్ తీసుకున్న రాజశేఖర్ నాయుడు అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా నిర్మించాడు సుధీర్ బాబు. అంతకుమించి డీటెయిల్స్ తెలియవు. స్వయంగా సుధీర్ బాబు ఎనౌన్స్ చేయబోతున్నాడు.