ప్రేమమ్ దర్శకుడికి నాగ్ ఛాన్స్

Monday,January 16,2017 - 06:38 by Z_CLU

మన్మధుని 2017 డైరీలో ఒక్క పేజీ కూడా ఖాళీగా లేదు. ప్రస్తుతం దర్శకేంద్రుని ‘ఓం నమో వెంకటేశాయ’తో బిజీగా ఉన్న నాగ్.. ఫిబ్రవరి లోగా థియేటర్స్ లోకి వచ్చేస్తాడు. ఆ వెంటనే ఇమ్మీడియట్ గా ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది సీక్వెల్ కు రెడీ అయిపోతాడు.

హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగార్జున ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేయబోతున్నాడో ప్రస్తుతానికైతే బయటికి రాలేదు కానీ, రాజుగారి గది తర్వాత, ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడో అఫీషియల్ గా పక్కా అయిపోయింది.

రీసెంట్ గా నాగచైతన్యకు ప్రేమమ్ తో హిట్ ఇచ్చిన చందూ మొండేటి, ఇప్పుడు ఏకంగా కింగ్ నే డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఓంకార్ ‘రాజుగారి గది-2’కి ఇలా ప్యాకప్ చెప్తాడో లేదో, ఇమ్మీడియట్ గా చందూ మొండేటితో సెట్స్ పైకి వెళ్తాడు నాగ్. ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కే అవకాశం ఉంది.