A.R. రెహమాన్ ప్లేస్ లో ఇప్పుడు అనిరుద్

Wednesday,May 30,2018 - 05:11 by Z_CLU

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘భారతీయుడు 2’ ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. స్క్రిప్ట్ వర్క్ తో పాటు సినిమాకి సంబంధించిన తక్కిన టెక్నీషియన్స్ ని ఫైనలైజ్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్, ఈ సినిమాకి అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు.

శంకర్ డైరెక్షన్ లో సినిమా ఉందనగానే డెఫ్ఫినేట్ గా ఆ సినిమాకి A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న 2.0 కి కూడా A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రీజన్స్ పెద్దగా బయటికి రాలేదు కానీ, కమలహాసన్ హీరోగా నటించనున్న భారతీయుడు 2 సినిమాకి, అనిరుద్ ని మ్యూజిక్ కంపోజర్ గా ఫిక్స్ చేసుకున్నారు ఫిల్మ్ మేకర్స్.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాని వీలైనంత త్వరలో సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.