మళ్ళీ ఆ ఇద్దరికే ఛాన్స్

Monday,January 16,2017 - 05:30 by Z_CLU

సంక్రాంతి బరిలోకి దిగిన బడా సినిమాలు ఖైదీ నం 150, బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణీ అటు టాలీవుడ్ లోను ఇటు ఓవర్ సీస్ లోను పాజిటివ్ ఇంపాక్ట్ తో దూసుకుపోతున్నాయి. ఓ వైపు ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేస్తున్న హడావిడిని ఓ కంట గమనిస్తూనే, మరో వైపు తన నెక్స్ట్ సినిమాలపై అప్పుడే ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేసేశారు చిరు, బాలయ్య.

గౌతమీపుత్ర శాతకర్ణీ సినిమాతో హిస్టారికల్ హిట్ ని అందుకున్న బాలయ్య, గౌతమిపుత్రా శాతకర్ణిలో శ్రియ కమిట్ మెంట్ కి పర్ఫామెన్స్ కి ఇంప్రెస్ అయిపోయి, తన నెక్స్ట్ సినిమాలో కూడా శ్రియకే ఛాన్స్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడట.

మరోవైపు చిరు ఖైదీ నం 150 లో హీరోయిన్ గా చేసిన కాజల్ కూడా మెగాస్టార్ తో మరోసారి జతకట్టే చాన్సెస్ లేకపోలేదు, మెగా స్టెప్స్ కి దీటుగా ఇంప్రెసివ్ లుక్స్ మెస్మరైజ్ చేసిన కాజల్ నే తన నెక్స్ట్ సినిమాలోను హీరోయిన్ గా ఫిక్స్ చేసే ఆలోచనలో మెగాస్టార్ ఉన్నాడని టాలీవుడ్ లో టాక్.