ఈసారి హిట్ కొడతారా...?

Thursday,March 21,2019 - 02:03 by Z_CLU

నాగచైతన్య, సమంతాల సినిమా ‘మజిలీ’ చుట్టూ ప్రస్తుతం ఇదే బజ్ నడుస్తుంది. దానికి రీజన్ ఈ రియల్ లైఫ్ కపుల్ కెమిస్ట్రీ చుట్టూ క్రియేట్ అవుతున్న హైపే. ఇప్పటికే వైడ్ రేంజ్ లో రీచ్ అయిన ఈ సినిమా టీజర్, ఒక్కొక్కటిగా రిలీజవుతున్న సాంగ్స్ ‘మజిలీ’ ని మరింత ఫోకస్ లోకి తీసుకొస్తున్నాయి. ఓ వైపు సక్సెస్ గ్యారంటీ అనే టాక్ బలపడుతున్నా, ఈ జోడీ ఈ సారి హిట్ కొడతారా..? అనే క్వశ్చన్ కూడా అక్కడక్కడ వినిపిస్తుంది.

ఏ మాయ చేశావే : ఈ సినిమా గురించి, అందునా పర్టికులర్ చై, స్యామ్ ల కెమిస్ట్రీ గురించి రాయాలంటే పేజీలు  పేజీలు  కూడా సరిపోవు. అంతలా మార్క్ క్రియేట్ చేసిందీ సినిమా. ఇప్పటికీ టాప్ రొమాంటికి ఎంటర్ టైనర్స్ టాపిక్ వస్తే అందులో ‘ఏ మాయ చేశావే’ కంపల్సరీగా ఉంటుంది.

ఆటో నగర్ సూర్య : ఈ సినిమా విషయంలో ఎక్కడ తేడా పడిందీ అని అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏ మాయ చేశావే తర్వాత ఈ జోడీ మళ్ళీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఇమ్మీడియట్ సినిమా ఇది. ఏముంది ఆ సినిమా క్రియేట్ చేసిన స్టాండర్డ్స్, ఈ సినిమా వరకు వచ్చేసరికి జస్ట్ మిచ్ మ్యాచ్ అయిందంతే. ఏముంది  సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

మనం : సూపర్ హిట్. ఇంకో మాట లేదు. 2 జెనెరేషన్స్ లో కనిపించినా… రెండేసి డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించినా వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరే కరెక్ట్ అనిపించుకున్నారు. జస్ట్ లవ్ కపుల్ గా నేనా…? అమ్మా నాన్నగా కనిపించినా వీళ్ళ కెమిస్ట్రీలో అంతే గ్రేస్ కనిపించింది.

2014 లో రిలీజయిందీ సినిమా. మళ్ళీ ఇన్నాళ్ళకు ‘మజిలీ’ తో అందునా పెళ్ళి తరవాత మరోసారి రీల్ కపుల్ గా కనిపించనున్నారు. మరి ఇప్పటికే ప్రమోషన్స్ తో సినిమాని వైడ్ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్న చై, స్యామ్ మరో హిట్ ని అందుకుంటారా లేదా చూడాలి.