కొత్త సినిమా ఎనౌన్స్ చేసిన నితిన్

Thursday,March 21,2019 - 05:24 by Z_CLU

నితిన్ నుంచి అప్ డేట్ వచ్చేసింది. శ్రీనివాస కల్యాణం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఎనౌన్స్ చేస్తానని ఈమధ్య ప్రకటించాడు. చెప్పినట్టుగానే ఫస్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు నితిన్.

నిజానికి నితిన్ నెక్ట్స్ మూవీ వెంకీ కుడుములతో ఫిక్స్ అయింది. అదెప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అంతా వెయిటింగ్. కానీ అంతలోనే చంద్రశేఖర్ ఏలేటి సినిమాను ప్రకటించాడు. ఇదే సెట్స్ పైకి వస్తుందని కూడా క్లారిటీ ఇచ్చాడు.

ఏప్రిల్ సెకెండ్ వీక్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని ప్రకటించాడు నితిన్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.