Bangarraju - మరికొన్ని గంటల్లో మీ ఇంట్లోకి బంగార్రాజు

Sunday,March 27,2022 - 11:29 by Z_CLU

Bangarraju World Television Premiere today

సంక్రాంతి బరిలో పందెంకోడిలా నిలిచిన బంగార్రాజు.. ఇప్పుడు మన ఇళ్లలోకి వచ్చేస్తున్నాడు. జీ తెలుగు ఛానెల్ సగర్వంగా అందిస్తోంది బంగార్రాజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్. ఈరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి మీ జీ తెలుగు ఛానెల్ లో బంగార్రాజు సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

అక్కినేని స్టార్ హీరోలు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ వెరీ స్పెషల్ మల్టీస్టారర్ మూవీ సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్టయింది. కరోనా పరిస్థితుల వల్ల థియేట్రికల్ సిస్టమ్ సరిగ్గా లేనప్పటికీ, ఆంధ్రాలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో బాక్సాఫీస్ బరిలో దిగిన బంగార్రాజు, అనుకున్న టార్గెట్ ను అందుకున్నాడు. సిసలైన సంక్రాంతి విజేతగా నిలిచాడు.

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది బంగార్రాజు సినిమా. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగచైతన్య, తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో కనిపించాడు. కృతిశెట్టి అందాలు, ఫరియా అబ్దుల్లా ‘స్పెషల్’ అందాలు ఈ సినిమాకు మరింత కలర్ తీసుకొచ్చాయి.

ఇవాళ్టి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లో మరో సర్ ప్రైజ్ కూడా ఉంది. కేక పెట్టించే బోనస్ మాస్ సాంగ్ తో బంగార్రాజు రెడీ అయ్యాడు. సో.. డోంట్ మిస్ ఇట్.

బంగార్రాజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. మీ జీ తెలుగులో.. సాయంత్రం గం. 5.30 నుంచి..

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics