శ్రీవిష్ణు నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ

Thursday,March 21,2019 - 12:49 by Z_CLU

శ్రీవిష్ణు సినిమాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. బాక్సాఫీస్ రిజల్ట్ సంగతి పక్కనపెడితే కుర్రాడు కొత్తగా ట్రై చేస్తాడనే ఇమేజ్ అయితే ఉంది. ఇప్పుడు అదే లైన్ లో వస్తోంది బ్రోచేవారెవరురా. టైటిల్ లోనే కొత్తదనం చూపించిన ఈ హీరో, ఫస్ట్ లుక్ కూడా అదే ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చాడు. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది.

శ్రీవిష్ణు స్కూటర్ నడుపుతుంటే, వెనక రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కూర్చున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ముగ్గురూ రంగురంగుల డ్రెస్సులు వేసుకొని కలర్ ఫుల్ గా ఉన్నారు. చుట్టూ ఉన్న థీమ్ చూస్తుంటే, మూవీ మేకింగ్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీని సెలక్ట్ చేసుకున్నట్టున్నారు.

శ్రీవిష్ణు స‌ర‌స‌న‌ నివేదా థామ‌స్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా స‌త్య‌దేవ్‌, నివేదా పేతురాజ్ కీల‌క పాత్ర‌ల్లో కనిపిస్తారు. వివేక్ ఆత్రేయ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగ‌ర్ సంగీత అందిస్తున్నాడు. మే నెల‌లో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

న‌టీన‌టులు: శ్రీవిష్ణు, నివేదా థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేదా పేతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వివేక్ ఆత్రేయ‌
నిర్మాత‌: విజ‌య్ కుమార్ మ‌న్యం
బ్యాన‌ర్‌: మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్‌
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీరాం
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌