NC22 ప్రీ లుక్ తో బజ్ క్రియేట్ చేస్తున్న చైతు
Tuesday,November 22,2022 - 02:25 by Z_CLU
వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తెలుగు-తమిళ్ బైలింగ్వెల్ ప్రాజెక్ట్ ఇటివలే సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. NC22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా మేకర్స్ ప్రీ లుక్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు . ప్రీ-లుక్‌లో, నాగ చైతన్య పోలీసు అవతార్‌లో కనిపిస్తూ ఇంటెన్స్ లుక్ తో ఎట్రాక్ట్ చేశాడు. అతను తన తోటి అధికారుల చేతుల్లో లాక్ అయినట్టు కనిపిస్తున్నాడు. రేపు నవంబర్ 23 న 10:18 AM కి చైతన్య పుట్టినరోజు సర్ ప్రైజ్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. లెజెండరీ తండ్రీ కొడుకులు మాస్ట్రో ఇళయరాజా మరియు లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics