ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ముగ్గురు బంగార్రాజులు

Tuesday,January 11,2022 - 01:19 by Z_CLU

NagaChaitanya reveals interesting element of Bangarraju

సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి దూసుకొస్తున్నాడు బంగార్రాజు. తండ్రికొడుకులు నాగ్-చైతూ కలిసి నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ అంచనాల్ని పెంచేలా మరో ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు నాగచైతన్య. బంగార్రాజు సినిమాలో ఏకంగా ముగ్గురు బంగార్రాజులు కనిపిస్తారట.

“సినిమాలో రాము క్యారెక్టర్ (నాగార్జున) ఉంది. పెద్ద బంగార్రాజు పాత్ర (నాగార్జున) ఆత్మ రూపంలో ఉంటుంది. వీళ్లిద్దరూ కాకుండా నా పాత్ర (చిన్న బంగార్రాజు) కూడా ఉంటుంది. అయితే ఆత్మగా ఉన్న పెద్ద బంగార్రాజు పాత్ర నాకు కనిపిస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.”

ఇలా బంగార్రాజుపై హైప్ క్రియేట్ చేశాడు చైతూ. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. కృతి శెట్టి హీరోయిన్.