Allu Arjun Rowdy Boys - ఆల్ ది బెస్ట్ చెప్పిన బన్నీ

Tuesday,January 11,2022 - 12:30 by Z_CLU

Allu Arjun congratulates Rowdy Boys team and unveiled Date Song

రౌడీ బాయ్స్ ప్రమోషన్ లో భాగమయ్యాడు అల్లు అర్జున్. ఈ సినిమా నుంచి డేట్ సాంగ్ ను రిలీజ్ చేసిన బన్నీ.. రౌడీ బాయ్స్ ప్రమోషన్ లో భాగమైనందుకు హ్యాపీగా ఫీలయ్యాడు. తన కెరీర్ ను మలుపుతిప్పిన ఆర్య సినిమాకు దిల్ రాజు నిర్మాత అని, అలాంటి వ్యక్తి కుటుంబం నుంచి వస్తున్న ఆశిష్ కోసం ప్రచారం చేయడం తన బాధ్యత అన్నాడు బన్నీ.

“డేట్ సాంగ్ చాలా బావుంది. చూస్తుంటే ఫిబ్ర‌వ‌రి 14న రావాల్సిన సినిమాను జ‌న‌వ‌రి 14నే రిలీజ్ చేస్తున్న‌ట్లు అనిపిస్తుంది. రౌడీ బాయ్స్‌ ఎంటైర్ టీమ్‌కి అభినంద‌న‌లు. ఆశిష్ చాలా బాగా స్టెప్పులేశాడు. జ‌న‌వ‌రి 14న వస్తున్న ఈ సినిమావ‌స్తుంది. ఆల్ ది బెస్ట్‌. ఇదే సంద‌ర్భంలో కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత వ‌స్తున్న సినిమాల‌న్నీ బావున్నాయి. అఖండ‌, మా పుష్ప సినిమాలు వ‌చ్చాయి. అలాగే నానిగారి శ్యామ్ సింగ‌రాయ్ కూడా పెద్ద స‌క్సెస్ అయ్యింది. నాకు ఆ టీమ్‌కు కంగ్రాట్యులేట్ కుద‌ర‌లేదు. ఇప్ప‌డు చెబుతున్నాను. సంక్రాంతికి చాలా సినిమాలు వ‌స్తున్నాయి. ఇది తెలుగు సినిమాలు గెల‌వాల్సిన స‌మ‌య‌మిది. అన్నీ సినిమాలు స‌క్సెస్ కావాలి”