చైతూ-సమంత పెళ్లికి డేట్ ఫిక్స్

Monday,May 22,2017 - 12:45 by Z_CLU

నాగచైతన్య, సమంత ప్రేమించుకుంటున్నారని, వాళ్ల నిశ్చితార్థం కూడా పూర్తయిందనే విషయం తెలిసిందే. తాజాగా వీళ్ల పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా చైతూ ప్రకటించాడు. అక్టోబర్ లో సమంతను పెళ్లాడనున్నట్టు ప్రకటించాడు. పెళ్లికి సంబంధించి మరిన్ని వివరాల్ని బయటపెట్టాడు కూడా.

రారండోయ్ వేడుక చూద్దాం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన చైతూ, సమంతతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. అక్టోబర్ లో కచ్చితంగా తమ పెళ్లి ఉంటుందని తెలిపాడు. అయితే హైదరాబాద్ లో మాత్రం ఉండదని, ఓ ఫారిన్ డెస్టినేషన్ కోసం ట్రై చేస్తున్నామని ప్రకటించాడు.

ఇక పెళ్లి కూడా హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరుగుతుందని ఎనౌన్స్ చేశాడు చైతూ. మొదట క్రిస్టియన్ కల్చర్ ప్రకారం సమంతను పెళ్లాడిన తర్వాత.. హిందు సంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతుందని తెలిపాడు. పెళ్లి తేదీ, వేదిక వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తానంటున్నాడు. కమిట్ అయిన సినిమాలన్నింటినీ అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని చైతూ, సమంత టార్గెట్ గా పెట్టుకున్నారు.