కేశవ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

Monday,May 22,2017 - 01:46 by Z_CLU

మే 19 న రిలీజయింది కేశవ. డిఫెరెంట్ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ లా తయారైన నిఖిల్, కేశవ సినిమాతో మరో సక్సెస్ కొట్టాడు. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో హై ఎండ్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమా, రిలీజైన ప్రతి సెంటర్ లోను పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తూ జస్ట్ 3 రోజుల్లో 11.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది.

సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. అభిషేక్ నామా నిర్మించిన ఈ సినిమాకి సన్నీ M.R. మ్యూజిక్ కంపోజ్ చేశాడు. గతంలో నిఖిల్-సుధీర్ వర్మ కాంబోలో వచ్చిన స్వామి రారా సినిమా సూపర్ హిట్ అయింది. ఆ మూవీ సక్సెస్ తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా ఇదే.

అటు ఓవర్సీస్ లో కూడా కేశవ సినిమాకు డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి. రివెంజ్ డ్రామా కాన్సెప్ట్ తో స్టయిలిష్ గా ఈ సినిమాను పిక్చరైజ్ చేశాడు దర్శకుడు సుధీర్ వర్మ. ఇషా కొప్పికర్ ఎప్పీయరెన్స్, పర్ఫార్మెన్స్ సినిమాకు మరో ప్లస్  పాయింట్ గా మారింది.