మహేష్ బాబు కొరటాల సినిమా సెట్స్ పైకి..

Monday,May 22,2017 - 11:59 by Z_CLU

మహేష్ బాబు, కొరటాల శివ సినిమా ఈ రోజు నుంచి సెట్స్ పైకి వచ్చింది. దాదాపు 7 నెలల కిందటే ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో మొదలైంది. అయితే మహేష్ మాత్రం ఈ షూటింగ్ లో లేడు.

కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి ‘భరత్ అనే నేను’ అనే టైటిల్ దాదాపు ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో మహేష్ ఎన్నారైగా కనిపించనున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ మూవీ ఫైనల్ షెడ్యూల్ లో ఉన్నాడు మహేష్. వచ్చే నెల నుంచి కొరటాల సినిమా సెట్స్ పైకి వస్తాడు.

D.V.V. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని ట్యూన్స్ కూడా ఇచ్చాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 11న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.