టక్ జగదీష్ గా నాని

Tuesday,December 03,2019 - 12:16 by Z_CLU

రూరల్ ఏరియాల్లో ఇన్-షర్ట్ చేసేవాడ్ని టక్-అబ్బాయి అని ఏడిపిస్తుంటారు. లేదంటే సరదాగా అలా పిలుస్తుంటారు. ఇప్పుడదే నాని సినిమా టైటిల్ అయింది. నాని కొత్త సినిమాకు టక్-జగదీష్ అనే టైటిల్ పెట్టారు. శివ నిర్వాణ దర్శకుడు.

నాని నటించిన నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శివ నిర్వాణ. తన రెండో ప్రయత్నంగా మజిలీ తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు మూడో సినిమాగా మరోసారి నానితో కలిసి టక్-జగదీష్ మూవీ చేస్తున్నాడు. తన స్టయిల్ లోనే హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయంటున్నాడు డైరక్టర్.

ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. తమన్ సంగీతం అందించబోతున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించబోతున్నారు.