వాలంటైన్స్ డే స్పెషల్.. ‘‘లవ్ స్టోరీ’’ మ్యూజికల్ ప్రివ్యూ

Wednesday,February 12,2020 - 12:21 by Z_CLU

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘‘లవ్ స్టోరీ’’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

సంక్రాంతి పండగ రోజు ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న టీమ్ ఇప్పుడు ప్రేమికుల రోజున మరో సర్ ప్రైజ్ తో రాబోతుంది. మ్యూజికల్ లవ్ స్టోరీగా రాబోతున్న లవ్ స్టోరీ నుండి 1 మినిట్ ‘‘మ్యూజికల్ ప్రివ్యూ’’ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 14న ఉదయం 11గం.07 ని లకు సినిమాలోని మొదటి పాట ‘‘ఏయ్ పిల్లా’’ అనే సాంగ్ ప్రివ్యూ ని రిలీజ్ చేయబోతుంది.

ఎ.ఆర్ రెహామాన్ స్కూల్ నుండి పరిచయం అవుతున్న పవన్ సి.హెచ్ అందించిన స్వరాలు ఈ లవ్ స్టోరీని మరింత అందంగా మార్చాయంటోంది టీం. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ అందమైన ప్రేమకథ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచింది.