శ్రీనివాస్ రెడ్డి ఇంటర్వ్యూ

Tuesday,December 03,2019 - 02:49 by Z_CLU

‘భాగ్యనగర వీధుల్లో…గమ్మత్తు’ సినిమాతో నిర్మాతగా.. దర్శకుడిగా మారాడు కమెడియన్ శ్రీనివాస రెడ్డి. సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని చెప్తున్న శ్రీనివాస్ రెడ్డి, ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పుకున్నాడు అవి మీకోసం… 

సినిమా అంటే ఇష్టం కాదు…

నాకు సినిమా మీద ఇష్టం కన్నా ప్రేమ ఎక్కువ. ఇష్టం వేరు… ప్రేమ వేరు…

అలా బ్యానర్ అయింది….

ఫ్లయింగ్ కలర్స్ అని మాకో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. దాన్ని పర్మనెంట్ చేద్దామనుకున్నా.. అందుకే ఆ పేరుతోనే బ్యానర్ రిజిస్టర్ చేయించా…

కొత్తవాడైతే కష్టం…

కొత్త దర్శకుడైతే ఇంతమంది ఆర్టిస్టులను హ్యాండిల్ చేయడం కష్టం అనిపించింది.  అందుకే నేన్ డైరెక్షన్ చేద్దామని ఫిక్సయ్యా…

అలా నేర్చుకున్నా…

సినిమాల్లో నటించేటప్పుడే డైరెక్షన్ లో అక్కడక్కడా మెళకువలు నేర్చుకుంటూనే ఉన్నా.. నాకు ఎక్కడెక్కడ తెలీదు  అనుకుంటానో.. సరిగ్గా అలాంటి సిచ్యువేషన్ లో నా డైరెక్టర్స్ ఎలా చేస్తున్నారో గమనించి నేర్చుకున్నా…

సినిమాకి ముందు తరవాత…

ఫిలిమ్ మేకింగ్ గురించి తెలియడానికి, సినిమాని తెరకెక్కించడానికి చాలా తేడా ఉంటుంది. ఈ సినిమా చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను…

చాలా హెల్ప్ అయింది…

సినిమా చూసిన దిల్ రాజు గారు ఒక వ్యాల్యూబుల్ సజెషన్ ఇచ్చారు. అది చాలా పనికొచ్చింది. సినిమా సెట్స్ పైకి రాకముందు చాలా మంది ఒపీనియన్ తీసుకున్నాను. అనిల్ రావిపూడి లాంటి దర్శకులకు కూడా చూపించాను. బావుంది జాగ్రత్తగా చేసుకో అన్నారు…

రసగుల్లా ఎపిసోడ్…

సినిమాలో రసగుల్లా ఎపిసోడ్ హైలెట్ అవుతుంది.  ‘బతుకు ఎడ్లబండి’ అంటూ వచ్చే ఎపిసోడ్ తో పాటు, ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన ఎలిమెంట్స్ ని సందర్భానుసారంగా ప్రెజెంట్ చేశాం. అవన్నీ వరసగా కడుపు నిండా నవ్విస్తాయి.

మూడింట్లో ఇదే ప్రిఫరెన్స్...

డైరెక్టర్.. ప్రొడ్యూసర్.. ఆర్టిస్ట్.. 3 ఆప్షన్స్ లో నాకు ఆర్టిస్ట్ అంటేనే చాలా ఇష్టం. అందుకే ‘మహర్షి’ అవకాశం వచ్చినప్పుడు ఈ సినిమాని పక్కన పెట్టుకుని, ఆ సినిమా కంప్లీట్ చేసుకుని వచ్చా… బాలయ్య ‘రూలర్’  కోసం కూడా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ని పక్కన పెట్టేసి వెళ్ళా…

యాక్టర్ గా ఏంటో తెలుసు…

నటుడిగా నేనేంటో నాకు తెలుసు… ఇక దర్శకుడిగా నా స్థాయి ఏంటనేది ఈ సినిమా రిలీజయితేనే తెలుస్తుంది. దర్శకుడిగా సక్సెస్ అయి, నిర్మాతగా డబ్బులు వస్తే.. ఇది కూడా కంటిన్యూ చేస్తా…

నమ్మకం ఉంది కాబట్టే…

సినిమా రెడీ అయ్యాక సక్సెస్ గ్యారంటీ అని ఇంకా నమ్మకం కుదిరింది కాబట్టే సొంతంగా రిలీజ్ చేస్తున్నా. మీ అందరికీ నచ్చుతుందనే ఆశ పడుతున్నా…