సెట్స్ పైకొచ్చిన సవ్యసాచి

Wednesday,November 08,2017 - 10:35 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది సవ్యసాచి. సెట్స్ పైకి రాకముందే ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ పైకొచ్చింది. నాగచైతన్య హీరోగా ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. పెళ్లి తర్వాత చైతూ సెట్స్ పైకి రావడం ఇదే ఫస్ట్ టైం.

 

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాకు సంబంధించి నిన్న, మొన్న ఫొటో సెషన్స్ జరిగాయి. హీరో నాగచైతన్య, హీరోయిన్ నిధి అగర్వాల్ మధ్య  ఓ ఫొటోషూట్ చేశారు. ఈరోజు నుంచి రెగ్యులర్ షూట్ మొదలుపెట్టారు. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కొన్ని ట్యూన్స్ లాక్ చేశారు. ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో నాగచైతన్య కూడా పాల్గొన్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోంది సవ్యసాచి సినిమా. ఇందులో హీరో ఎడమ చేయి అతడి మాట వినదు. బ్రెయిన్ తో దీనికి కనెక్షన్ కట్ అయిపోతుంది. కుడిచేతికి ఎంత పవర్ ఉంటుందో, అంతకంటే ఎక్కువ శక్తి ఎడమ చేతికి ఉంటుంది. అలాంటి లెఫ్ట్ హ్యండ్ తో హీరో ఏం చేశాడనేదే సినిమా స్టోరీ.