నాగ అన్వేష్ ఇంటర్వ్యూ

Thursday,November 02,2017 - 01:13 by Z_CLU

నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ‘ఏంజెల్’ నవంబర్ 3 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. ‘పళని’ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ డ్రామా, జస్ట్ యూత్ నే కాదు ఫ్యామిలీస్ ని కూడా ఎట్రాక్ట్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. ఈ సందర్భంగా ఈ మూవీ హీరో నాగ అన్వేష్ మీడియాతో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు… అవి మీ కోసం..

మీరనుకున్నట్టు ఉండదు…

సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి సినిమా చాలా సీరియస్ గా ఉంటుందేమో  అనుకుంటారు చాలామంది.. కానీ ఏంజెల్ అలా కాదు, సినిమా బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు అవుట్ అండ్ అవుట్ కామెడీతో థ్రిల్లింగ్ గా ఉంటుంది సినిమా…

చాలా భయపడ్డాం కానీ…

సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు బడ్జెట్ ఎక్కువవుతుందనే క్లారిటీ ఉంది. ఆ తరవాత అంత రికవరీ అవుతుందా అనే క్వశ్చన్ రేజ్ అయినప్పుడు కాన్సెప్ట్ పై చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ఓవర్ సీస్ లో కూడా ట్రెండ్ మారింది. ఇంతకు ముందు స్టార్ హీరోల సినిమాలే ఆడేవి, కానీ ఇప్పుడు టాక్ బావుంటే చిన్న సినిమాలు ఆడేస్తున్నాయి అదే కాన్ఫిడెన్స్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చాం…

స్మగ్లింగ్ చేస్తుంటాం…

సినిమాలో నాది మాస్ క్యారెక్టర్. నేను సప్తగిరితో కలిసి స్టాచ్యూ స్మగ్లింగ్ చేస్తుంటా… ఈ ప్రాసెస్ లో ఒకరోజు హెబ్బా మాతో కలవడం, అనుకోకుండా స్టాచ్యూ మిస్సవ్వడం, ఆ స్టాచ్యూకి  దేవలోకానికి ఉండే సోషియో ఎలిమెంట్స్, ఈ సిచ్యువేషన్స్ లో షాయాజీ షిండే గారు, ఆ తరవాత క్రియేట్ అయ్యే కన్ఫ్యూజన్స్ , కామెడీ.. సినిమా మొత్తం హిలేరియస్ గా ఉంటుంది…

కొత్త స్వర్గం చూస్తారు…

ఈ సినిమాలో కొత్త స్వర్గం చూస్తారు… ఇంతకు ముందు సినిమాల్లో చూసిన దాని కంటే డిఫెరెంట్ గా ఉంటుంది. దాదాపు 45 నిమిషాల CG వర్క్ చాలా అద్భుతంగా వచ్చింది.

గుర్తుండిపోతుంది…

సినిమా క్లైమాక్స్ లో గరుడతో ఉండే ఫైట్ హైలెట్ అవుతుంది. సినిమా మొత్తంలో ఆ ఫైట్ సీక్వెన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ సినిమాకి ఆయనే స్ట్రెంత్  

పళని ఇంతకు ముందు బాహుబలి, రుద్రమదేవి సినిమాలకు పని చేయడం ఈ సినిమాకి పెద్ద ఎసెట్. ఆ రెండు సినిమాలు కూడా హై ఎండ్ CG వర్క్ తో తెరకెక్కినవే. ‘పళని’ గారికి CG విషయంలో గ్రిప్ ఎక్కువ. అందుకే ఈ సినిమాకి ఆయనే పెద్ద స్ట్రెంత్.

సినిమా డిలే అవడానికి వినాయక్ గారే కారణం…

సినిమా స్క్రిప్ట్ రేంజ్ లో ఉన్నప్పటి నుండే వినాయక్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఎడిటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా ఇన్వాల్వ్  అయ్యారు.  ఒకచోట 3D సీక్వెన్స్ ఉంటే బావుంటుందని సజెస్ట్ చేశారు. దాని వల్ల సినిమా ఇంకొంత డిలే అయింది. సినిమా విషయంలో ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.