లక్కీ చాన్స్ కొట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్

Thursday,November 02,2017 - 02:29 by Z_CLU

మహేష్ బాబు, A.R. మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ హిట్ స్పైడర్ తరవాత రకుల్ ప్రీత్ సింగ్ మరింత బిజీ అయిపోయింది. బ్యాక్ టు టు బ్యాక్ సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, A.R. మురుగదాస్ డైరెక్షన్ లో మరో సినిమాకు కూడా సంతకం చేసినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న విజయ్ 62 వ సినిమా ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సరసన రకుల్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందనే న్యూస్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని మ్యాగ్జిమం డిసెంబర్ కల్లా సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.