రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్ ?

Saturday,August 19,2017 - 06:03 by Z_CLU

ప్రెజెంట్ ‘రాజు గారి గది 2’ సినిమాను పూర్తి చేసిన నాగార్జున నెక్స్ట్ చేయబోయే సినిమా ఏమిటా.. అనే క్యూరియాసిటీ ప్రస్తుతం అక్కినేని అభిమానుల్లో నెలకొంటుంది. ఇప్పటికే నాగ్ లిస్ట్ లో ఓ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ నాగ్ మాత్రం నెక్స్ట్ ఓ రీమేక్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

ఇటీవలే కోలీవుడ్ ఆర్.మాధవన్ , విజయ్ సేతుపతి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన ‘విక్రమ్ వేధ’ సినిమాను నాగ్ తెలుగులో రీమేక్
చేయబోతున్నాడనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. అయితే నాగ్ ఈ సినిమాలో విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ చేయబోతున్నాడని, మాధవన్ క్యారెక్టర్ ను తెలుగులో కూడా మాధవన్ చేయనున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.