మణిరత్నం దర్శకత్వంలో నాని ?

Saturday,August 19,2017 - 07:06 by Z_CLU

ప్రెజెంట్ టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ త్వరలోనే మణి రత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. వరుస సూపర్ హిట్స్ తో స్టార్ హీరో రేంజ్ సంపాదించుకున్న నాని ప్రస్తుతం MCA సినిమాతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తవ్వగానే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘కృష్ణార్జునయుద్ధం’ సినిమాను సెట్స్ పై పెట్టబోతున్న నాని ఈ సినిమా తర్వాత మణి రత్నం తో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడట.

ఆ మధ్య మణి రత్నం తెరకెక్కించిన ‘ఓకే బంగారం’ సినిమాలో హీరో దుల్కర్ కి తన వాయిస్ అందించిన నాని ఆ సినిమా ఫంక్షన్ లో ఎప్పటి కైనా మణి రత్నం సినిమాలో హీరో అవ్వాలనుకుంటున్నాని చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నో ఇంటర్వ్యూ ల్లో కూడా మణి రత్నం గారు తన ఫెవరెట్ డైరెక్టర్ అని ఆయనతో ఓ సినిమా చేయాలనీ ఉందని చెప్పుకొచ్చాడు. అయితే నాని కోరిక త్వరలోనే తీరబోతుందని, ఇప్పటికే మణి రత్నం నాని కి ఓ లవ్ స్టోరీ వినిపించాడని నాని కి కూడా స్క్రిప్ట్ బాగా నచ్చిందని, వచ్చే ఏడాది మణి రత్నం-నాని కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరి నాని మణిరత్నం హీరోగా ఎలా ఎంటర్టైన్ చేస్తాడో..చూడాలి.