ఫస్ట్ లుక్ తో రెడీ అవుతున్న అఖిల్

Saturday,August 19,2017 - 04:23 by Z_CLU

అక్కినేని అఖిల్ విక్రం కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న  సినిమా ఆడియన్స్ లో ఓ రేంజ్ క్యూరియాసిటీ కలిగిస్తుంది. ప్రెజెంట్ ఈ సినిమాకు సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది.. యూనిట్ రిలీజ్ చేసే లోపే లీక్ అయిన ఈ స్టిల్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే అఫీషియల్ గా రిలీజ్ చేయాలనుకున్న ఈ స్టిల్ ముందే రిలీజ్ అవ్వడంతో నాగ్ ఈ విషయం పై స్పందించాడు. లీక్ అయిన స్టిల్ గురించి క్లారిటీ ఇస్తూ ఒరిజినల్ స్టిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీనికి మించిన ఎగ్జైటెడ్ అప్ డేట్  ఈ ఆగస్టు 21న రిలీజ్ కానుందని తెలిపాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మొత్తం ఈ డేట్ పై ఫిక్సయింది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ మరియు కాస్ట్ క్రూ డీటెయిల్స్ కూడా ఆరోజే తెలియజేయబోతున్నారు మేకర్స్.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా రిలీజ్  చేయబోతున్నారు..