సోషల్ మీడియాలో ‘మహానటి’ హంగామా

Thursday,April 19,2018 - 06:47 by Z_CLU

సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది మహానటి సినిమా. ఈ నెల 14 న రిలీజైన ఈ సినిమా టీజర్ కేవలం 5 రోజుల్లో 4 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. సీనియర్ నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తూ రిలీజైన 50 సెకన్ల టీజర్, అన్ని క్యాటగిరీస్ ని ఇంప్రెస్ చేస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచేసిన ఫిల్మ్ మేకర్స్, రేపు ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘మూగ మనసులు’ ని రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. దాంతో ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మొత్తం ఈ సింగిల్ పై మళ్ళింది. టీజర్ లాగే ఈ సాంగ్ కూడా అంతే మెస్మరైజ్ చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ప్రియాంక దత్, స్వప్నదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంతా కీ రోల్ ప్లే చేస్తుంది.