సమ్మర్ రేస్ లో 'మిస్టర్'

Thursday,March 09,2017 - 02:21 by Z_CLU

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ‘మిస్టర్’.ఈ సినిమా షూటింగ్ లో వరుణ్ గాయపడటం.. తర్వాత కాస్త రెస్ట్ తీసుకోవడంతో సినిమా షూటింగ్ దాదాపు నెల పైనే పోస్ట్ పోనే అయింది.. ఇక ఈ పోస్ట్ పోనే కారణంగా ఈ సినిమా సమ్మర్ కి రావడం కష్టమనుకున్నారంతా..

అయితే లెటస్ట్ అప్ డేట్ ప్రకారం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 14 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి ఫాస్ట్ గా ఫినిష్ చేయాలని చూస్తున్నారట.. అంటే వరుణ్ కూడా మిస్టర్ గా సమ్మర్ రేస్ లో నిలబడ బోతున్నాడన్నమాట…