V4 బ్యానర్ పై ఆది సినిమా

Thursday,March 09,2017 - 03:20 by Z_CLU

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్, UV క్రియేషన్స్ తో పాటు స్టూడియో గ్రీన్ సంయుక్తంగా ‘V4 మూవీస్’ బ్యానర్ పై ఆది హీరోగా తెరకెక్కనున్న సినిమా ఈ రోజే లాంచ్ అయింది. ఈ మూడు బ్యానర్స్  కలిసి నిర్మిస్తున్న సినిమాకి ‘ఈ Tv ప్రభాకర్’ దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమాకి సంబంధించిన డీటేల్స్ ఇంకా బయటికి రాలేదు కానీ, రీసెంట్ గా ‘చుట్టాలబ్బాయి’ సినిమాతో తెలుగులో మంచి హిట్ ని బ్యాగ్ లో వేసుకున్న ఆది, ఓ వైపు శ్రీ రామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘శమంతక మణి’ సినిమాలో నటిస్తూనే, మరో వైపు ఈ సినిమాకి కూడా సంతకం చేసేశాడు. ప్రీ ప్రొడక్షన్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయిన ఈ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.