సమ్మర్ లో రానున్నఇంట్రెస్టింగ్ సినిమాలు

Tuesday,January 28,2020 - 11:02 by Z_CLU

పండగ సీజన్ ఇలా ముగిసిందో లేదో ఇంట్రెస్టింగ్ సినిమాల్ని సమ్మర్ రిలీజ్ కి లైనప్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ని రివీల్ చేస్తూ ఆడియెన్స్ లో క్యూరియాసిటీని జెనెరేట్ చేస్తారు. మండే వేసవిలో కూల్ బ్రీజ్ లా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్న సినిమాలివే.   

Vనాని విలన్ గా నటిస్తున్నాడు. అందునా ఇది 25 వ సినిమా. ఈ నంబర్ చుట్టూ మరింత హైప్ పెరిగేలా మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్. వీటితో పాటు ఈ సుధీర్ బాబు. ప్రస్తుతానికి ఈ సినిమాలో నటిస్తున్న స్టార్స్ గురించి తప్ప ఒక్క క్లూ కూడా బయటికి రాకుండా సస్పెన్స్ మెయిన్ తిన్ చేస్తూ సినిమాని తెరకెక్కించే పనిలో ఉంది టీమ్. సమ్మర్ లో రిలీజవుతుంది.

లవ్ స్టోరీ : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ‘లవ్ స్టోరీ’. ఈ వేసవి వేడిలో మరింత లవ్ మ్యాజిక్ ని స్ప్రెడ్ చేయనుంది ఈ సినిమా. సమ్మర్ రిలీజ్ కే ఫిక్సయ్యారు మేకర్స్.

క్రాక్ : రవితేజ్ అమార్క్ మాస్ ఎంటర్ టైనర్. ఈ సినిమాలో మరోసై పోలీస్ యూనిఫామ్ వేసుకోనున్నాడు రవితేజ. గోపీచంద్ మాలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. రిలీజయ్యేది సమ్మర్ కే.

సోలో బ్రతుకే సో బెటర్ : సాయితేజ్ హీరోగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సుబ్బు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి తేజ్ మరింత కొత్తగా కనిపించనున్నాడు. నభా నతేష్ ఈ సినిమాలో హీరోయిన్. సమ్మర్ కి రిలీజవుతుంది ఈ సినిమా.

సీటీమార్ : సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ సినిమా. గోపీచంద్ సరసన తమన్నా నటిస్తుంది. ఈసారి పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్న గోపీచంద్ ‘సీటీమార్’ తో మళ్ళీ ఫామ్ లోకి రావాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

శ్రీకారం : శర్వానంద్ సినిమా. రీసెంట్ గా రిలీజయిన పోస్టర్ ని బట్టి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండబోతుందనిపిస్తుంది. ఈ సినిమాకి కిషోర్ డైరెక్టర్. అల్టిమేట్ గా సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేద్దామనుకుంటున్నారు మేకర్స్.