ఈ రాక్షసుడ్ని అంతా ఇష్టపడతారు!

Tuesday,January 28,2020 - 11:55 by Z_CLU

రక్షకుడు-రాక్షసుడు పేరిట V సినిమా నుంచి ఫస్ట్ లుక్స్ రిలీజ్ అవుతున్నాయి. నిన్న రక్షకుడంటూ సుధీర్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈరోజు రాక్షసుడిగా వచ్చాడు నాని. చేతిలో కత్తెర పట్టుకొని రక్తం మరకలతో వైల్డ్ గా కనిపిస్తున్నాడు నేచురల్ స్టార్.

ఈ ఒక్క లుక్ తో సినిమాతో అతడు నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. సినిమాలో నానికి హీరోయిన్ గా అదితిరావు నటిస్తోంది. నాని ఇందులో మర్డరర్ గా కనిపించబోతున్నాడు. ఇక సుధీర్ బాబు ఐపీఎస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య జరిగే యాక్షన్ డ్రామానే ఈ V

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సైరా ఫేమ్ అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా మార్చి 25న థియేటర్లలోకి వస్తోంది V