జెర్సీ 2 వారాల వసూళ్లు

Friday,May 03,2019 - 12:59 by Z_CLU

నాని కెరీర్ లోనే బెస్ట్ మూవీగా పేరుతెచ్చుకున్న జెర్సీ సినిమా సక్సెస్ ఫుల్ గా మూడో వారంలోకి ఎంటరైంది. 2 వారాలైనా ఈ సినిమా స్టడీగా నడుస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రతి సెంటర్ లో వసూళ్లు సాధిస్తూనే ఉంది.

నిన్నటితో 14 రోజుల రన్ పూర్తిచేసుకున్న జెర్సీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్ సాధించింది. అంతేకాదు, ఈ 2 వారాల్లో బ్రేక్-ఈవెన్ సాధించి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైంది. అటు ఓవర్సీస్ లో కూడా జెర్సీకి భారీ వసూళ్లు వస్తున్నాయి. నిన్నటితో ఈ సినిమాకు 5 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం 2 వారాల షేర్
నైజాం – రూ. 9.61 కోట్లు
సీడెడ్ – రూ. 1.98 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.38 కోట్లు
ఈస్ట్ – రూ. 1.66 కోట్లు
వెస్ట్ – రూ. 1.17 కోట్లు
గుంటూరు – రూ. 1.54 కోట్లు
కృష్ణా – రూ. 1.51 కోట్లు
నెల్లూరు – రూ. 0.69 కోట్లు