హ్యాట్రిక్ అందుకుంటుందా...?

Sunday,October 08,2017 - 03:00 by Z_CLU

‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ తో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన మెహ్రీన్ ప్రెజెంట్ వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తుంది. మొదటి సినిమాతోనే లక్కీ హీరోయిన్ అనే ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా ‘మహానుభావుడు’ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. వరుసగా  నటించిన రెండు సినిమాలు హిట్ సాధించడంతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది మెహ్రీన్.

ప్రస్తుతం రవితేజ తో కలిసి ‘రాజా ది గ్రేట్’ లో జత కట్టిన ఈ బ్యూటీ ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై ఉన్న పాజిటీవ్ బజ్, టీజర్- ట్రైలర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తుండడంతో ఖచ్చితంగా మరో హిట్ అందుకుంటాననే కాన్ఫిడెన్స్ తో ఉంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ సినిమాతో మెహ్రీన్ హ్యాట్రిక్ కొడితే.. ఇక ఈ బ్యూటీ కి  టాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయనడంలో సందేహం లేదు.