ఇద్దరితో ఫిక్స్.. ముందెవరితో...?

Sunday,October 08,2017 - 01:26 by Z_CLU

ప్రెజెంట్ వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ గా మహానుభావుడుతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు… ఈ సినిమా పూర్తయి చాలా రోజులే అవుతున్నా నెక్స్ట్ సినిమాను ఇంత వరకూ సెట్స్ పై పెట్టలేదు శర్వా. తన ప్రతీ సినిమా సెట్స్ పైకె వెళ్లేముందే స్పెషల్ కేర్ తీసుకునే ఈ యంగ్ హీరో ప్రెజెంట్ ఓ రెండు సినిమాలతో రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే సుధీర్ వర్మ తో ఓ సినిమా ప్రకాష్ కోవెలమూడితో మరో సినిమా ఫైనల్ చేసుకున్న శర్వా ఈ ఇద్దరిలో ఏ డైరెక్టర్ తో నెక్స్ట్ సినిమా చేస్తాడో.. అనే క్యూరియాసిటీ నెలకొంటుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ రెండు సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది కానీ రెండిటిలో ఏది ముందో మాత్రం చెప్పలేను అని తెలిపాడు. సో ఈ ఇద్దరిలో శర్వా ముందుగా ఏ డైరెక్టర్ తో సెట్స్ పైకి వేళ్తాడో.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.