ఆ డైరెక్టర్ తో చిరు ఫిక్స్ ....

Wednesday,December 07,2016 - 04:00 by Z_CLU

ఓ మెగా హీరోను డైరెక్ట్ చేసి మెగా కాంపౌండ్ లో అడుగుపెడితే చాలు ఇక ఆ డైరెక్టర్ కు వరుసగా ఛాన్సులు వస్తాయి. అతడిపై మెగా స్టాంప్ పడాల్సిందే. సో.. ఇప్పుడు సురేందర్ రెడ్డిపై కూడా మెగాస్టాంప్ పడబోతోంది. లేటెస్ట్ గా రామ్ చరణ్ తో ‘ధృవ’ సినిమాను తెరకెక్కించిన సురేందర్ రెడ్డికి మరో బంపర్ అఫర్ అందిందట. త్వరలోనే మెగా స్టార్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరిగాయని, ఇంకా జరుగుతున్నాయని టాక్.

    ‘ధృవ’ సినిమా రీమేక్ అయినప్పటికీ తన స్టైలిష్ మేకింగ్ తో మెగాస్టార్ ను ఎట్రాక్ట్ చేశాడట సురేందర్ రెడ్డి. అందుకే లేటెస్ట్ గా ఈ డైరెక్టర్ కి మెగా ఆఫర్ అందించి ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట చిరు. ఇటీవలే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు సురేందర్ రెడ్డి. బహుశా వచ్చే ఏడాది మెగాస్టార్ ని డైరెక్ట్ చేయొచ్చని చెప్పకనే చెప్పాాడు. చిరంజీవికి కిక్ టైపు ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ స్టోరీని వినిపించానని ప్రకటించాడు సురేందర్. అన్నీ కుదిరితే మెగాస్టార్ 151 సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.