కోలీవుడ్ కి నిఖిల్ హిట్ మూవీ

Wednesday,December 07,2016 - 03:10 by Z_CLU

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు హీరో నిఖిల్. ఓవైపు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నడుస్తున్నప్పటికీ… సినిమాపై నమ్మకంతో రిలీజ్ చేశారు. అనుకున్నట్టుగానే ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమా పెద్ద హిట్ అయింది. ఏకంగా 20కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాదించిన ఈ మూవీ ఇప్పుడు రీమేక్ రైట్స్ విషయంలో కూడా హాట్ కేక్ గా మారింది. ఓ తమిళ నిర్మాత భారీ మొత్తానికి ఈ మూవీ రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ రీమేక్ లో హీరోగా నటించబోతున్నాడు. తెలుగు వెర్షన్ లో నందిత శ్వేత, హెబ్బాపటేల్, అవికాా గౌర్ హీరోయిన్లుగా నటించారు. తమిళ్ వెర్షన్ లో నటించే హీరోయిన్ల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. మరోవైపు ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో స్టడీగా వసూళ్లు సాధిస్తోంది.

epc-2