మెరిట్ నటి శకం ముగిసింది

Wednesday,December 07,2016 - 04:30 by Z_CLU

ఒక శకం ముగిసింది. తమిళ నాడు ముఖ్యమంత్రి అస్తమయం పెద్ద లోటునే మిగిల్చింది. ఆర్ధిక ఇబ్బందుల వల్ల పై చదువులకు దూరమైనా, స్కూల్ స్టేజ్ లోనే మెరిట్ స్టూడెంట్ అనిపించుకున్న జయలలిత ఆమె జీవితంలో ఎంచుకున్న నట, రాజకీయ రంగాల్లోనూ మెరిట్ అనిపించుకుంది.

తన పసితనంలోనే ‘శ్రీ శైల మహాత్మే’ అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన జయలలిత, ఆ తరవాత ‘ చిన్నాడ గోంబే’ అనే సినిమాతో ఫుల్ ఫ్లెడ్జ్ హీరోయిన్ గా నటించారు. ఆ తరవాత వరసగా ఆమె నటించిన ‘మాలతి’ ‘కావేరి తండా కలైసెల్వి’ లాంటి సినిమాలు సక్సెస్ అవడం తో తమిళ సినిమా దృష్టి జయలలితపై పడింది. ‘వెన్నిరా ఆదై’ సినిమాతో తమిళ సినిమాలో అడుగు పెట్టిన జయలలిత అతి కొద్దికాలం లోనే తెలుగు సినిమాలో, అందునా అక్కినేని నాగేశ్వర రావు సరసన ‘మనుషులు మమతలు’ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

పని పట్ల నిక్కచ్చిగా ఉండే మనస్తత్వం, క్రమశిక్షణ, దానికి తోడు కావాల్సినంత టాలెంట్, జయలలిత సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టిన కేవలం ఆరేళ్ళ లోనే 50 సినిమాలు పూర్తి చేసుకుంది. తమిళ సూపర్ స్టార్ శివాజీ గణేషన్ సరసన నటించిన ‘గలాటా కళ్యాణం’ ఆమె నటించిన 50 వ సినిమా.

mangalyabalam-75

సినిమాలను ఎంచుకునే విషయంలో పర్టికులర్ గా ఉండే జయలలిత తన సినిమా కరియర్ లో కనీసం చిన్న గ్యాప్ కూడా బిజీగా గడిపిన రోజులే ఎక్కువ. అందుకే సినిమాకు పరిచయమైన కేవలం పదేళ్ళ కాలంలో 100 సినిమాలు అవలీలగా పూర్తి చేసుకుంది జయలలిత. ‘తిరు మాంగళ్యం ’ ఆమె నటించిన వందో సినిమా.

jaya3

జయలలిత కరియర్ బిగినింగ్ లో ఎన్ని సినిమాలు చేసినా సౌత్ ఇండియన్ సినిమా ఆమె వైపు తలెత్తుకుని చూసేలా సినిమా ‘ఆమె ఎవరు..?’ 1966 లో సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జయలలిత కరియర్ లో మైలు స్టోన్ లా నిలిచిపోయింది. జగ్గయ్య హీరోగా నటించిన ఈ సినిమాలో జయలలిత తో పాటు వాణి శ్రీ కూడా మరో హీరోయిన్ గా నటించింది. B.S. నారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని P.S. వీరప్ప నిర్మించారు. రేపు ఉదయం 6 గంటలకు ‘జీ సినిమాలు’ లో ఈ సూపర్ హిట్  సినిమా టెలీకాస్ట్ అవుతుంది.

ame-evaru